Boney Kapoor: అల్లు అర్జున్ తప్పేమీ లేదు: బోనీకపూర్

Thre is no mistake from Allu Arjun says Boney Kapoor

  • జనాలు ఎక్కువగా రావడం వల్లే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందన్న బోనీకపూర్
  • దక్షిణాది ప్రేక్షకులకు తమ హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్య
  • అగ్ర హీరోల సినిమాలకు జనాలు భారీగా వస్తారన్న బోనీకపూర్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ ను నిందించాల్సిన అవసరం లేదని... ఎక్కువ మంది జనాలు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు.

దక్షిణాది ప్రేక్షకులకు తమ అభిమాన హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందని బోనీకపూర్ చెప్పారు. తమిళ స్టార్ అజిత్ నటించిన ఒక సినిమాకు అర్ధరాత్రి షోకు తాను వెళ్లానని... దాదాపు 20 వేల మంది థియేటర్ దగ్గర ఉన్నారని... సినిమా థియేటర్ వద్ద అంతమందిని చూడటం తనకు అదే తొలిసారని అన్నారు. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చినప్పుడు కూడా అంతే మంది ప్రేక్షకులు థియేటర్ బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు. 

చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాలకు ప్రేక్షకులు ఇలాగే వస్తారని బోనీకపూర్ అన్నారు. జనాలు ఎక్కువగా వచ్చినందుకే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు.

Boney Kapoor
Allu Arjun
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News