Arjuna Award: తెలుగు తేజాలు య‌ర్రాజి జ్యోతి, జీవాంజి దీప్తిల‌కు అర్జున పుర‌స్కారాలు

Jeevanji Deepthi and Jyothi Yarraji Win Arjuna Award

  • ఈ ఏడాది మొత్తం 32 మందికి అర్జున పుర‌స్కారాలు
  • అథ్లెటిక్స్ విభాగంలో య‌ర్రాజి జ్యోతికి అవార్డు 
  • పారా అథ్లెటిక్స్ నుంచి జీవాంజి దీప్తికి పుర‌స్కారం

కేంద్రం ప్ర‌క‌టించిన జాతీయ క్రీడా పుర‌స్కారాల్లో తెలుగు తేజాలు ఇద్ద‌రు ఎంపిక‌య్యారు. అథ్లెటిక్స్ విభాగంలో య‌ర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జీవాంజి దీప్తిల‌కు అర్జున అవార్డులు ద‌క్కాయి. ఇక య‌ర్రాజి జ్యోతి ఏపీలోని విశాఖ‌ప‌ట్నం వాసి కాగా, జీవాంజి దీప్తిది తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా. 

ఈ ఏడాది ఈ ఇద్ద‌రితో స‌హా మొత్తం 32 మంది అర్జున పుర‌స్కారాలకు ఎంపిక‌య్యారు. అటు ఖేల్ ర‌త్న‌కు మ‌ను బాక‌ర్‌, గుకేశ్‌, ప్ర‌వీణ్ కుమార్, హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌ను కేంద్రం ఎంపిక చేసింది.

ఇక అర్జున అవార్డు (జీవితకాలం సాఫ‌ల్య పుర‌స్కారం) కోసం సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా-స్విమ్మింగ్) ఎంపిక‌య్యారు. అలాగే ద్రోణాచార్య అవార్డు కోసం కోచ్‌లు సుభాష్ రాణా (పారా-షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ)ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది. 

ఇదిలాఉంటే.. జాతీయ క్రీడా అవార్డులు-2024 విజేతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ ఈరోజు (గురువారం) ప్ర‌క‌టించింది. ఈ నెల 17న‌ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకోనున్నారు.


Arjuna Award
Jeevanji Deepthi
Jyothi Yarraji
  • Loading...

More Telugu News