BJP: నిర్మల్‌లో బీజేపీకి షాక్... బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత

BJP leader joins BRS from Nirmal

  • బీఆర్ఎస్‌లో చేరిన నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నేత మహేశ్ రెడ్డి
  • కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న మహేశ్ రెడ్డి
  • నిర్మల్‌లో పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని హామీ

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ మహేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి... బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకున్నారు.

కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డి మాట్లాడుతూ... నిర్మ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News