Ladies Tailer: ఆ అమ్మాయిని చూడగానే ప్రదీప్ శక్తికి నోటమాట రాలేదు: డైరెక్టర్ వంశీ

Vamsi Interview

  • 1985లో వచ్చిన 'లేడీస్ టైలర్'
  •  ఆ సినిమా షూటింగు గురించి ప్రస్తావించిన వంశీ 
  • వెంకటరత్నం పాత్రను గురించి ప్రస్తావన 
  • ఆ సీన్లో జరిగిన సంఘటన గురించి వివరణ


ఒక్కోసారి కొన్ని సినిమాల షూటింగుల సమయంలో కొన్ని తమాషా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. 'లేడీస్ టైలర్' షూటింగు సమయంలో జరిగిన అలాంటి ఒక తమాషా సంఘటన గురించి దర్శకుడు వంశీ ప్రస్తావించారు. ఈ సినిమాలో ఊరిపెద్ద వెంకటరత్నం, ఆడవాళ్ల వంక ఎవరు కన్నెత్తి చూసినా చేయ్యో .. కాలో తీసేస్తాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన కరణంగారి మేనల్లుడు, 'కుమారి' అనే అమ్మాయిని పాడు చేస్తే .. అతని చెయ్యిని వెంకటరత్నం నరికేసే సీన్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాము" అని అన్నారు. 

"వెంకటరత్నం పాత్రను ప్రదీప్ శక్తి పోషిస్తున్నాడు. కరణంగారి మేనల్లుడి పాత్రలో మా ప్రొడక్షన్ మేనేజర్ 'రమణ' కనిపిస్తానని అన్నాడు. మరి 'కుమారి' పాత్రలో ఎవరు? అని నేను అడుగుతూ ఉంటే, ఆ వీధి చివర ఇంట్లో ఉండే 'సావిత్రి' అనే అమ్మాయి ఆ పాత్రలో కనిపిస్తుందని తమ్ముడు సత్యం చెప్పాడు. అతను ఆ మాట అనగానే, అలా పక్కకి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి లాక్కుపోయాడు కెమెరామెన్ హరి అనుమోలు.  

"వెంకటరత్నం పాత్రలో .. మెరిసే పెద్ద కత్తి పట్టుకుని, 'నా ప్రాణమైన చెల్లెలిని పాడు చేస్తావా' అనే డైలాగ్ ను ప్రాక్టీస్ చేస్తూ, ప్రదీప్ శక్తి అక్కడికి వచ్చాడు. తన స్నేహితుడైన హరి అనుమోలుతో, 'డైలాగ్ రెడీ రా .. నువ్వు కెమెరా ఆన్ చేసుకోవడమే లేటు' అన్నాడు. 'ఆ అమ్మాయి వైపు చూస్తూ ఆ డైలాగ్ చెప్పాలి' అంటూ సావిత్రి వైపు చూపించాడు హరి. ఆ అమ్మాయివైపు చూసిన ప్రదీప్ శక్తి డైలాగ్ మరిచిపోయాడు .. నోట మాట రావడం లేదు. అందుకు కారణం .. ఈ ప్రదీప్ శక్తి అంతకుముందు రోజు రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడట" అంటూ తనదైన స్టైల్లో వంశీ ముగించాడు. 

  • Loading...

More Telugu News