Game Changer: 'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. శంకర్ మార్క్‌లోనే పెద్ద రన్ టైమ్..!
- రామ్‌చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్'
- సెన్సార్ బోర్డు నుంచి సినిమా యూ/ఏ సర్టిఫికెట్
- 2 గంటల 45 నిమిషాల నిడివితో థియేటర్లకు సినిమా
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.
అలాగే ఇంతకుముందు శంకర్ సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా భారీ రన్ టైమ్‌తో సెన్సార్ సర్టిఫికేట్ పొందడం గమనార్హం. 2 గంటల 45 నిమిషాల నిడివితో సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఇక ఇప్పటికే విడుదలైన మూవీ సాంగ్స్, టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు సినిమా ట్రైలర్ కూడా విడుదల కానుంది. అలాగే జనవరి 4న రాజమండ్రిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కాగా, 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.