Srivari Hundi: ఏడుకొండలవాడికి గతేడాది వెయ్యికోట్లకు పైగా ఆదాయం
--
తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా గతేడాది రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 2024 లో 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వివరించింది. ఇందులో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ పేర్కొంది. భక్తులకు ఏడాది మొత్తంలో 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు తెలిపింది. టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ సత్రాలలో 6.30 కోట్ల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొంది.