PM Modi: ఈ నెల 8న విశాఖకు రానున్న మోదీ

PM Narendra Modi AP Tour On Jan 8

  • నేరుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి..
  • అక్కడి నుంచే పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ టూర్ కు సంబంధించి ప్రధాని కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం అందించింది. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నంలో ల్యాండ్ అవుతారని, అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ చేరుకుంటారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధానికి స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధానితో పాటు వారు కూడా ఏయూ చేరుకుంటారని వివరించారు. అక్కడి నుంచే ప్రధాని మోదీ ఏపీలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని సమాచారం.

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, రైల్వేజోన్‌ పరిపాలన భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ఈమేరకు విశాఖ అధికారులకు పీఎంవో నుంచి సమాచారం అందిందని, అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం.

PM Modi
Narendra Modi
AP Tour
Chandrababu
Pawan Kalyan
Vizag
Andhra University
  • Loading...

More Telugu News