New York: కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్ నైట్ క్లబ్
- న్యూ ఇయర్ వేళ పేలుళ్లు, కాల్పులతో వణుకుతున్న అమెరికా
- అమజురా నైట్ క్లబ్ లో కాల్పులు
- కాల్పుల ఘటనలో 11 మందికి గాయాలు
కొత్త సంవత్సరం వేళ పేలుళ్లు, కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. న్యూ ఆర్లీన్స్ లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతలోనే లాస్ వెగాస్ లో పేలుడు సంభవించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు చెందిన లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఎదుట టెస్లా కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ఏడుగురు గాయపడ్డారు.
తాజాగా న్యూయార్క్ లోని క్వీన్స్ కౌంటీలో ఉన్న అమజురా నైట్ క్లబ్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డట్టు స్థానిక పోలీసులు తెలిపారు.