Rashmika Mandanna: రష్మిక ప్రేమాయణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ
- తెలుగు హీరోను రష్మిక పెళ్లి చేసుకోబోతోందన్న నాగవంశీ
- ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదని వ్యాఖ్య
- బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగుతున్న రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్ గా ఎదిగింది. 'పుష్ప 2'తో ఆమె కెరీర్ తార స్థాయికి చేరకుంది. మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ లో ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనేది ఫిలిం నగర్ టాక్.
రష్మిక ప్రేమ వ్యవహారంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తాజా చిత్రం 'డాకూ మహారాజ్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షోలో బాబీ, సంగీత దర్శకుడు తమన్, నాగవంశీ సందడి చేశారు.
ఈ షోలో రష్మిక టాపిక్ రాగా... రష్మిక తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతోందని తెలుసని... అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని రష్మిక చెప్పడం లేదని అన్నారు.