Keerthy Suresh: నేను 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకున్నాం.. కీర్తి సురేశ్

Keerthi Suresh Interview

  • సమంత, విజయ్ లకు ఈ విషయం తెలుసని వెల్లడి
  • తన పెళ్లి ఇప్పటికీ ఓ కలలాగే ఉందన్న నటి
  • భర్త ఆంటోనికి బిడియం ఎక్కువని చెప్పిన కీర్తి

ప్రముఖ నటి కీర్తి సురేశ్ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. తాజాగా తన సినిమా ప్రమోషన్లలోనూ కీర్తి పసుపుతాడుతో కనిపించింది. పసుపుతాడు చాలా పవిత్రమైనదని చెప్పిన నటి.. అందుకే మెడలో పసుపుతాడుతోనే ప్రమోషన్లకు హాజరైనట్లు వివరించింది. మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మార్చుకుంటానని తెలిపింది. భర్త ఆంటోని తటిల్ తో తన ప్రేమ, వివాహానికి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తాను పన్నెండో తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకున్నామని వివరించింది. అయితే, 2010లో ఆంటోని తనకు ప్రపోజ్ చేశాడని, అదికూడా తాను సవాల్ చేయడంతోనేనని కీర్తి సురేశ్ వివరించింది. పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్నామని, 2016 లో ఆంటోని తనకు ప్రామిస్ రింగ్ ఇచ్చాడని, అప్పటి నుంచి తమ మధ్య బంధం మరింత బలపడిందని తెలిపింది. పెళ్లి అయ్యేంత వరకూ ఆ రింగ్ ను తన వేలి నుంచి తీయలేదని, తన సినిమాల్లోనూ వేలికి రింగ్ చూడొచ్చని చెప్పింది. 

వివాహం కోసం ఎప్పటి నుంచో తాము కలలు కన్నామని, తన పెళ్లి ఇప్పటికీ ఓ కలలాగే ఉందని కీర్తి సురేశ్ చెప్పింది. ఆంటోని తనకంటే ఏడేళ్లు పెద్ద అని వివరించింది. ఆరేళ్లుగా ఆంటోని ఖతార్‌లో వర్క్‌ చేస్తున్నాడని, తనకు చాలా సపోర్ట్ ఇస్తాడని చెప్పింది. ఆంటోనీ జీవిత భాగస్వామిగా రావడం తన అదృష్టమని తెలిపింది.

తమ ప్రేమ విషయం ఇండస్ట్రీలో సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్యలక్ష్మి, ఇంకా కొంతమందికి మాత్రమే తెలుసని చెప్పింది. పెళ్లి ఫిక్స్‌ అయ్యేవరకు మా ప్రేమను ప్రైవేటుగానే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. ఆంటోనికి బిడియం ఎక్కువని అందుకే మీడియా ముందు కలిసి కనిపించలేదని తెలిపింది. ఏళ్ల తరబడి ప్రేమించుకుంటున్నప్పటికీ 2017లోనే తొలిసారి తాము విదేశాలకు వెళ్లినట్లు వివరించింది. రెండేళ్ల క్రితమే సోలో ట్రిప్ కు వెళ్లినట్లు వివరించింది.

  • Loading...

More Telugu News