Bengaluru: పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకుని య‌జ‌మాని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

Tragic Incident in Bengaluru Man Found Dead After Losing Beloved Pet Dog

  • క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఘ‌ట‌న 
  • 9ఏళ్లుగా జ‌ర్మ‌న్ షెప‌ర్డ్ జాతికి చెందిన కుక్క‌ను పెంచుకుంటున్న యువ‌కుడు 
  • మంగ‌ళ‌వారం నాడు అనారోగ్యంతో శున‌కం మృతి
  • అదే రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న పెంపుడు కుక్క మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక రాజ‌శేఖ‌ర్ (33) అనే యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే.. బెంగ‌ళూరులోని హెగ్గ‌డ‌దేవ‌న‌పుర‌లో నివాసం ఉండే రాజ‌శేఖ‌ర్ తొమ్మిదేళ్లుగా జ‌ర్మ‌న్ షెప‌ర్డ్ జాతికి చెందిన కుక్క‌ను పెంచుకుంటున్నాడు. దాని పేరు బౌన్సీ. 

అయితే, ఆ శున‌కం అనారోగ్యంతో మంగ‌ళ‌వారం నాడు చ‌నిపోయింది. దాంతో అదే రోజు త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో దాని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాడు.  ప్రాణంగా చూసుకున్న‌ బౌన్సీని కోల్పోవ‌డం రాజ‌శేఖ‌ర్‌ను తీవ్రంగా క‌లిచివేసింది. దాని మృతిని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 

అది కూడా బౌన్సీని క‌ట్ట‌డానికి ఉప‌యోగించిన చైన్‌తోనే ఉరేసుకున్నాడు. బుధ‌వారం ఉద‌యం త‌న ఇంట్లో శ‌వ‌మై క‌నిపించాడు. ఈ ఘట‌న‌పై మ‌ద‌నాయ‌క‌న‌హ‌ళ్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News