Fire Accident: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో దగ్ధమైన దివాకర్ ట్రావెల్స్ బస్సు.. వీడియో ఇదిగో

Diwakar Travels Bus Caught Fire In Anantapuram

   


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు ఈ తెల్లవారుజామున దగ్ధమైంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ నిలిపి ఉంచిన నాలుగు బస్సుల్లో ఒకటి పూర్తిగా దగ్ధం కాగా, మరోటి పాక్షికంగా కాలిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో మిగతా బస్సులకు ప్రమాదం తప్పింది. విద్యుదాఘతం వల్ల ఈ ఘటన జరిగిందా? లేదంటే ఎవరైనా ఆకతాయిలు బస్సుకు నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News