JEE Mains: జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
- అఖిల భారత స్థాయిలో ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ
- జనవరి 22 నుంచి 30 వరకు మెయిన్స్ పరీక్షలు
- పరీక్షలకు మూడ్రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలన్న ఎన్టీఏ
అఖిల భారత స్థాయిలో ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు ప్రకటించింది. జనవరి 22 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ఎన్టీఏ వెల్లడించింది.
కాగా, జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయి. మొదటి సెషన్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. రెండో సెషన్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలకు మూడ్రోజుల ముందు అధికారిక పోర్టల్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.