Revanth Reddy: ఎవరెవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారో వివరాలు ఉన్నాయి: ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy meets MLAs and MPs

  • ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సూచనలు
  • కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళదామన్న సీఎం
  • స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రజలకు చేరువ కావాలని సూచన

ఎవరెవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారో తన వద్ద వివరాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చి శుభాకాంక్షలు చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశా నిర్దేశనం చేశారు. వారితో కాసేపు ప్రభుత్వం, పార్టీ గురించి మాట్లాడారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఆయన సూచనలు చేశారు. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళదామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రజలకు చేరువ కావాలన్నారు. ఈరోజు నుంచి ప్రజాప్రతినిధులతో మాట్లాడతానని... ఎవరెవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారో తెలుసన్నారు.

Revanth Reddy
Telangana
Congress
Local Body Polls
  • Loading...

More Telugu News