Raj Thackeray: ఓట్ల వద్దకు వచ్చేసరికి ప్రజలు మమ్మల్ని విస్మరిస్తున్నారు: రాజ్ థాకరే

If anyone attacks Marathi people I will defend them as a Marathi says Raj Thackeray

  • ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రజలు తమ వద్దకు వస్తున్నారన్న రాజ్ థాకరే
  • ఎన్నికలకు వచ్చేసరికి ఓటు వేయడం లేదన్న రాజ్ థాకరే
  • ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామని వెల్లడి

మహారాష్ట్ర ప్రజలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకున్నప్పుడు మాత్రమే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తమను విస్మరిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

సమస్య వస్తేనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, ఎన్నికల రోజు మాత్రం తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు.

ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను గెలుచుకొని అధికారం దక్కించుకుంది. ప్రతిపక్ష కూటమి కనీసం 50 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 125 స్థానాల్లో పోటీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ముంబైలోని మాహిం స్థానం నుంచి బరిలో నిలిచిన రాజ్ థాకరే తనయుడు అమిత్ థాకరే కూడా ఓడిపోయారు.

  • Loading...

More Telugu News