Hyderabad Metro: మేడ్చల్, శామీర్‌పేటల వరకు మెట్రో రైలు పొడిగింపు

Metro extention till Medchal and Shamirpet

  • ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో పొడిగింపు
  • జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మేర పొడిగింపు
  • డీపీఆర్ సిద్ధం చేయాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం ఆదేశం

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త. హైదరాబాద్ నార్త్ సిటీవాసులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు.

డీపీఆర్‌లను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలన్నారు.

ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉండనుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖాన, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేటకు 22 కిలోమీటర్ల మేర కారిడార్‌ను విస్తరిస్తున్నారు.

  • Loading...

More Telugu News