Volunteers: ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వాలంటీర్ల నిరసన

Volunteers protest from tomorrow

  • ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్ల డిమాండ్
  • రేపు గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్ లకు వినతి పత్రాల అందజేత
  • ఎల్లుండి మోకాళ్ల మీద కూర్చొన భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్న వాలంటీర్లు

వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టనున్నట్టు స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. 

నిరసన కార్యక్రమాల్లో భాగంగా జనవరి 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్ లకు వాలంటీర్లు వినతి పత్రాలను అందజేయనున్నారు. 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ 4వ తేదీన బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఈశ్వరయ్య తెలిపారు.

Volunteers
Protest
  • Loading...

More Telugu News