Fire Accident: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం

Fire accident in Madhapur tech company

  • ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులోని టెక్ కంపెనీలో మంటలు
  • నిపుణ్ ఐటీ సొల్యూషన్స్‌లో అగ్ని ప్రమాదం
  • కాలిపోయిన సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు

హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్‌‍లోని ఐదో అంతస్తులో గల నిపుణ్ ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసింది.

అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. వాణిజ్య సముదాయంలో మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాలలోని సిబ్బంది బయటకు పరుగుతీశారు.

  • Loading...

More Telugu News