Glenn Maxwell: వామ్మో.. సూపర్ మ్యాన్ కూడా పనికిరాడుగా.. మ్యాక్స్‌వెల్ కళ్లుచెదిరే క్యాచ్!
- బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మ్యాచ్
- భారీ షాట్ కొట్టిన బ్రిస్బేన్ బ్యాటర్ ప్రెస్ట్‌విడ్జ్
- ఆ బంతిని బౌండరీ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి మ్యాక్సీ స్టన్నింగ్ క్యాచ్
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కళ్లుచెదిరే క్యాచ్ పట్టాడు. బ్రిస్బేన్ హీట్ బ్యాటర్ ప్రెస్ట్‌విడ్జ్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతిని బౌండరీ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్న మ్యాక్సీ... గాల్లో దాన్ని బౌండరీ లోపలికి విసిరేశాడు. తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి క్యాచ్ పట్టాడు.
అతడి అద్భుతమైన ఫీల్డింగ్‌కి బ్యాటర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. మ్యాక్స్‌వెల్ ముందు సూపర్ మ్యాన్ కూడా పనికిరాడుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.