Nani: నాని సినిమా 'హిట్ 3' షూటింగ్ లో విషాదం

Woman choreographer died in Srinagar

  • శ్రీనగర్ లో 'హిట్ 3' సినిమా షూటింగ్
  • ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కృష్ణ అనే మహిళ
  • గుండెపోటుతో మృతి చెందిన కృష్ణ

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'హిట్ 3' షూటింగ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతోంది. కేఆర్ కృష్ణ అనే మహిళ ఈ సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 

ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

కేరళలోని ఎర్నాకులంకు చెందిన కేఆర్ కృష్ణ... సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆమె వయసు 30 ఏళ్లు. ఆమె మృతి పట్ల సినిమా యూనిట్ సంతాపం తెలియజేసింది. ఈ చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా 2025 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   

  • Loading...

More Telugu News