Gautam Adani: అదానీకి షాక్ ఇచ్చిన స్టాలిన్ సర్కారు

Tamil Nadu govt cancels smart meter tender awarded to Adani Energy Solutions

  • స్మార్ట్ మీటర్ టెండర్లు రద్దు చేసిన తమిళనాడు
  • త్వరలో మరోమారు టెండర్లకు ఆహ్వానం
  • ధర ఆమోదయోగ్యంగా లేదన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్ప్

ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే ఖరారైన స్మార్ట్ మీటర్ల టెండర్ ను రద్దు చేసింది. అదానీ గ్రూప్ కోట్ చేసిన ధర చాలా ఎక్కువని, ఆ ధర ఆమోదయోగ్యం కాదని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ కారణంగా పాత టెండర్లు రద్దు చేసి త్వరలో మరోమారు టెండర్లు ఆహ్వానిస్తామని వివరించింది. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్, ఆపరేట్ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాన్‌జెడ్ కో) నిర్ణయించింది. ఇందుకోసం ప్యాకేజీ 1 లో భాగంగా 82 లక్షల స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. అందరికంటే తక్కువ ధరకు కోట్ చేసిన అదానీ కంపెనీకి ఈ టెండర్ దక్కింది. అయితే, అదానీ కంపెనీ ఆఫర్ చేసిన ధర (మిగతా కంపెనీల ధరతో పోలిస్తే తక్కువే) చాలా ఎక్కువని టాన్ జెడ్ కో తెలిపింది. దీంతో ఈ టెండర్ ను రద్దు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News