Bhagyashree: సల్మాన్ ఖాన్ నా చెవిలో లవ్ సాంగ్ పాడారు: భాగ్యశ్రీ
- సల్మాన్, భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'మైనే ప్యార్ కియా'
- ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ
- షూటింగ్ లో ఒక రోజంతా సల్మాన్ తన వెంట పడ్డారన్న భాగ్యశ్రీ
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'మైనే ప్యార్ కియా' సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. తన అందచందాలతో యువత హృదయాలను భాగ్యశ్రీ కొల్లగొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భాగ్యశ్రీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
'మైనే ప్యార్ కియా' సినిమా వల్ల సల్మాన్ తో తనకు మంచి రిలేషన్ ఏర్పడిందని భాగ్యశ్రీ తెలిపారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రోజు సల్మాన్ తన పక్కన కూర్చొని తన చెవిలో ఓ లవ్ సాంగ్ పాడారని... ఆ రోజంతా తన వెంట పడ్డారని చెప్పారు. తనను ఆటపట్టిస్తున్నారేమోనని తొలుత భావించానని... అయితే, కాసేపటికి అది హద్దులు దాటిందని తెలిపారు. ఎందుకు ఇలా చేస్తున్నారని తాను కోపడ్డానని చెప్పారు.
అయితే... వెంటనే ఆయన తనను పక్కకు తీసుకెళ్లి... 'నువ్వు ఎవరి ప్రేమలో ఉన్నావో నాకు తెలుసు. నీ ప్రియుడు హిమాలయ గురించి తెలుసు. ఆయనను ఒకసారి సెట్ కు పిలవచ్చు కదా' అని అన్నారని భాగ్యశ్రీ తెలిపారు. తన లవ్ స్టోరీ సల్మాన్ కు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయానని చెప్పారు. తనను ఆట పట్టించేందుకే సల్మాన్ అలా చేశాడని, ఆయనను తాను తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిపారు. 'మైనే ప్యార్ కియా' విడుదలైన కొంత కాలానికి హిమాలయ దాసానీ, భాగ్యశ్రీ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని చిత్రాల్లో భాగ్యశ్రీ నటించారు.