Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు

Police served notices to Perni Nani wife Jayasudha Again

  • విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసుల పిలుపు
  • ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌ పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచన
  • బియ్యం మాయం కేసులో నిందితురాలిగా ఉన్న జయసుధ

గోడౌన్‌లో బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని భార్య జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ నిమిత్తం ఇవాళ  (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఆర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌కు రావాలని తెలియజేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మంగళవారం రాత్రి పేర్ని నాని ఇంటికి వెళ్లారు. నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపుకి నోటీసులు అతికించి వెళ్లిపోయారు.

జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్‌లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఏ-1గా ఉన్నారు. అయితే, ఈ కేసులో జయసుధకు కోర్టులో ముందస్తు బెయిల్‌ లభించింది. పోలీసు విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Perni Nani
Perni Jayasudha
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News