Volodymyr Zelensky: ట్రంప్ అండగా ఉంటారని నమ్ముతున్నాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

We believe Donald Trump will support us says Zelensky

  • మూడేళ్లుగా తమపై రష్యా దురాక్రమణ జరుగుతోందన్న జెలెన్ స్కీ
  • శాంతిని సాధించేందుకు గట్టిగా పోరాడతామని వ్యాఖ్య
  • పుతిన్ దురాక్రమణను ట్రంప్ ఆపుతారని నమ్ముతున్నానన్న జెలెన్ స్కీ

కొత్త సంవత్సరం సందర్భంగా ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా తమ దేశంపై రష్యా దురాక్రమణ జరుపుతోందని... రష్యాను తాము కచ్చితంగా అడ్డుకుని తీరుతామని చెప్పారు. శాంతి అనేది తమ దేశానికి బహుమతిగా రాదనే విషయం తమకు తెలుసని అన్నారు. రష్యాను ఎదుర్కొని శాంతిని సాధించేందుకు గట్టిగా పోరాడతామని చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నానని జెలెన్ స్కీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణను ట్రంప్ ఆపుతారని నమ్ముతున్నానని చెప్పారు. మరోవైపు, పుతిన్ కు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ తమకు సహకరిస్తారంటూ జెలెన్ స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News