111 Years Imprisonment: మైనర్‌పై అత్యాచారం.. కేరళ టీచర్‌కు 111 సంవత్సరాల జైలుశిక్ష!

Kerala Tuition Teacher Gets 111 Years In Prison For Raping Girl

  • ఐదేళ్ల క్రితం ఘటనలో తుదితీర్పు
  • రూ. 1.05 లక్షల జరిమానా విధించిన కోర్టు.. చెల్లించకుంటే అదనంగా మరో ఏడాది శిక్ష
  • స్పెషల్ క్లాస్ పేరుతో ఇంటికి పిలిపించి దారుణానికి పాల్పడిన ఉపాధ్యాయుడు
  • విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న అతడి భార్య

ఐదేళ్ల క్రితం ప్లస్ వన్ (11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన కేరళ ఉపాధ్యాయుడికి తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 111 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, రూ. 1.05 లక్షల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది.

నిందితుడు మనోజ్ (44) 2019 జులై 2న బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిపై కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. స్పెషల్ క్లాస్ పేరుతో బాలికను ఇంటికి రప్పించి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ దారుణాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News