Chandrababu: కోటప్పకొండను సందర్శించిన సీఎం చంద్రబాబు
- ఇవాళ ఏపీలో పెన్షన్ల పంపిణీ
- పల్నాడు జిల్లా యల్లమందలో పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
- అనంతరం కోటప్పకొండ చేరుకున్న వైనం
- త్రికూటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ అనంతరం... ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. ఇక్కడి త్రికూటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్యమంత్రికి ఆలయం వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఐఏఎస్ అధికారిణి, ఏపీ టూరిజం అభివృద్ధి శాఖ వైస్ చైర్మన్-ఎండీ ఆమ్రపాలి కూడా ఉన్నారు.
చంద్రబాబుతో పాటు కోటప్పకొండ ఆలయానికి వచ్చినవారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, అరవిందబాబు తదితరులు ఉన్నారు.