Stock Market: 2024కు నష్టాలతో గుడ్ బై చెప్పిన స్టాక్ మార్కెట్లు

stock markets finishes 2024 with losses

  • 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 0.10 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరానికి నష్టాలతో ముగింపు పలికాయి. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య ఈరోజు ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు... చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 78,139కి పడిపోయింది. నిఫ్టీ కేవలం 0.10 పాయింట్లు కోల్పోయి 23,644 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో మన రూపాయి మారకం విలువ ఈరోజు మరింత పతనమయింది. రూపాయి మరో 13 పైసలు క్షీణించి 85.65కి పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ బ్యాంక్ (2.49%), ఐటీసీ (1.37%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.10%), టాటా మోటార్స్ (0.95%), టాటా స్టీల్ (0.88%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.35%), జొమాటో (-1.73%), టీసీఎస్ (-1.48%), ఇన్ఫోసిస్ (-1.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.92%).

  • Loading...

More Telugu News