KTR: అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు

High Court orders do not arrest KTR till judgement

  • ఫార్ములా ఈ-రేస్ కేసులో క్వాష్ పిటిషన్ వేసిన కేటీఆర్
  • నేడు సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
  • కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఈ కేసులో తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా రేసు కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఈరోజు సుదీర్ఘ విచారణ జరిగింది. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 

వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

ఇటీవల, క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే దర్యాఫ్తును కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది. పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ డిసెంబర్ 27కు వాయిదా వేసింది. ఆ తర్వాత విచారణను నేటికి (డిసెంబర్ 31) వాయిదా వేసింది. ఈరోజు సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.

  • Loading...

More Telugu News