Smriti Irani: 21వ శతాబ్దపు ప్రపంచ అత్యుత్తమ నటుల జాబితాలో ఇండియా నుంచి ఒకరికి చోటు!

Irfan Khan in in best 60 actors list released by The Independent

  • అత్యుత్తమ నటుల జాబితాను విడుదల చేసిన 'ది ఇండిపెండెంట్'
  • ఇండియా నుంచి ఇర్ఫాన్ ఖాన్ కు చోటు
  • 2020 ఏప్రిల్ 29న మృతి చెందిన ఇర్ఫాన్ ఖాన్

21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను బ్రిటీష్ ఆన్ లైన్ మీడియా సంస్థ 'ది ఇండిపెండెంట్' విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నటుల జాబితాలో ఇండియా నుంచి కేవలం ఒకే ఒకరికి చోటు దక్కింది. అమితాబ్, షారుక్, కమలహాసన్ లాంటి నటులకు కూడా ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఈ లోకంలోనే లేని ఇర్ఫాన్ ఖాన్ కు ఆ ఘనత దక్కింది. 

60 మంది ఉత్తమ నటుల జాబితాలో ఇర్ఫాన్ ఖాన్ కు 41వ స్థానం దక్కింది. 2020 ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి కారణంగా ఆయన చనిపోయారు. ఈ వ్యాధికి చికిత్స కోసం ఇర్ఫాన్ ఖాన్ కొన్ని నెలల పాటు యూకేలో ఉన్నారు. ఆయన పూర్తిగా కోలుకుంటారని అందరూ భావించారు. యూకేలో చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ముంబైలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 

తాను చివరగా నటించిన 'ఆంగ్రేజీ మీడియం' షూటింగ్ సమయంలో కూడా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో, కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుని... ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. చికిత్స పొందుతూనే 2020 ఏప్రిల్ 29న కన్నుమూశారు.

  • Loading...

More Telugu News