KTR: అందుకే కేటీఆర్‌పై కేసు నమోదు చేశాం: ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో హైకోర్టుకు ఏసీబీ
- ఈ-కార్ రేసింగ్‌లో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
- నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లింపులు జరిగాయన్న ఏసీబీ
- ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్‌లో చేర్చారా? అని అడిగిన హైకోర్టు
- కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదన్న న్యాయవాది సిద్ధార్థ్ దవే
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఏమిటంటూ హైకోర్టు... ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లింపులు జరిగాయని కోర్టుకు ఏసీబీ న్యాయవాది తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్‌పై కేసు నమోదు చేశామన్నారు.
ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్‌లో చేర్చారా? అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని అడిగింది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో పౌండ్ల రూపంలో రూ.46 కోట్ల చెల్లింపులు జరిగినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది. కానీ ఎవరి అనుమతు లేకుండానే రూ.54 కోట్లు చెల్లించారని ఏసీబీ పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉండగానే రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారని కౌంటర్‌లో ఆరోపించింది. డబ్బు చెల్లింపులో సెక్రటేరియేట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని పేర్కొంది. డబ్బు చెల్లింపు నోట్ ఫైల్‌లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేసినట్లు తెలిపారు.
కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదు: న్యాయవాది సిద్ధార్థ దవే
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌కు వర్తించవని హైకోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణ ఒప్పందంలో అధికారి సంతకం చేసినట్లు చెప్పారు. ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు.
ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని కోర్టుకు తెలిపారు. అవినీతి జరిగినట్లుగా కూడా ఆధారాలు చూపించలేదని వెల్లడించారు. వాదనల సందర్భంగా పలు తీర్పులను సిద్ధార్థ దవే చదివి వినిపించారు. కేటీఆర్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలని కోరారు. కాగా, భోజనం విరామం తర్వాత ఏజీ వాదనలు వినిపించనున్నారు.