Ghantasala: మనిషిపోతే అలా పోవాలి: ఘంటసాల గురించి మాధవపెద్ది సురేష్!

Madhavapeddi Suresh Interview

  • ఘంటసాలని గుర్తుచేసుకున్న మాధవపెద్ది సురేష్
  • అంతిమయాత్ర చూసి ఆశ్చర్యపోయానని వెల్లడి  
  • ఎటు చూసినా అభిమాన సముద్రమే కనిపించిందని వ్యాఖ్య 
  • జంధ్యాల - బాలు గారిని మరిచిపోలేనని వివరణ


మాధవపెద్ది సురేశ్ .. సంగీత దర్శకుడిగా సినిమా పాటపై తనదైన ముద్ర వేశారాయన. రీసెంటుగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు. "ఘంటసాల గారు వాళ్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా బ్రదర్ కూడా ఘంటసాల గారితో కలిసి పాడారు. ఒక వ్యక్తి చనిపోతే ఇంతమంది వస్తారా? అని నేను ఆశ్చర్యపోయింది ఘంటసాల గారు పోయినప్పుడే" అని అన్నారు. 

"ఘంటసాల గారు చనిపోయారు .. ఎటు చూసినా సముద్రంలా జనం. వేలమంది వస్తూనే ఉన్నారు. అంత జనంలో .. అంతమంది అభిమానులలో ఘంటసాలగారి 'పాడె' మోసే అదృష్టం నాకు కలిగింది. ఒక వైపున కృష్ణ .. ఒక వైపున శోభన్ బాబు .. ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ ఆయన పాడె మోశారు. అంతమంది అభిమానుల మధ్య జరుగుతున్న అంతిమయాత్ర చూసిన తరువాత, 'ఒక మనిషి పోతే ఇలా పోవాలి' అని నాకు మొదటిసారిగా అనిపించిన రోజు అది" అని అన్నారు.

ఆ తరువాత మరో ఇద్దరి మరణాలు నాకు ఎంతో బాధను కలిగించాయి. ఒకరు జంధ్యాల అయితే, మరొకరు బాలసుబ్రమణ్యం గారు. జంధ్యాల గారు నిజమైన కామెడీని బ్రతికించారు. ఆరోగ్యం పట్ల ఆయన ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడం వలన, 51 ఏళ్ల వయసులోనే పోయారు. ఆయన చనిపోయినప్పుడు కూడా జనం విపరీతంగా వచ్చారు. ఇక కొవిడ్ వచ్చి బాలుగారిని మాయం చేసింది. నా కెరియర్ ను ఎంతగానో ప్రభావితం చేశారాయన" అంటూ చెప్పుకొచ్చారు.



  • Loading...

More Telugu News