Team India: క్రికెట్ లవర్స్‌కు పండుగే.. 2025లో భారత క్రికెట్ జట్టు షెడ్యూల్స్ ఇవే
- ఏడాది ఆరంభం నుంచి చివరి వరకు టీమిండియా ఫుల్ బిజీబిజీ
- జనవరి 3న ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ నూతన ఏడాది ప్రారంభం
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, స్వదేశంలో ఆసియా కప్ సహా పలు ద్వైపాక్షిక సిరీస్‌ల ఖరారు
- బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో ఖరారైన షెడ్యూల్స్
- అర్హత సాధిస్తే జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, వేసవిలో ఐపీఎల్ షెడ్యూల్
మరికొన్ని గంటల్లోనే 2024 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. క్రీడారంగంలో క్రికెట్ విషయానికి వస్తే ఈ సంవత్సరం భారత్ జట్టుకు బాగానే కలిసి వచ్చింది. ముఖ్యంగా ‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ను టీమిండియా ముద్దాడింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ ట్రోఫీని భారత్ జట్టు గెలుచుకుంది. ఇక, పలు ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా సొంతం చేసుకుంది. అయితే, మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమితో ఏడాదికి వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
భారత జట్టు సరికొత్త ఉత్సాహంతో కొత్త ఏడాది 2025లో తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. జనవరి 3న సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ద్వారా ఈ ఏడాదిని ఆరంభించనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత టెస్ట్ స్పెషలిస్ట్‌లు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టీ20 సిరీస్ ఆడనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రెండు జట్లతో టీమిండియా వన్డే సిరీస్‌లు ఆడనుంది.
హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఆడనుంది. భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఆ తర్వాత వేసవిలో ఐపీఎల్ సందడి ఉంటుంది. మార్చి 14 నుంచి మే చివరి వరకు షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. టీమిండియా అర్హత సాధిస్తే ఈ మ్యాచ్‌లో ఆడుతుంది. అక్టోబర్‌లో టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జరగనున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో భాగంగా భారత జట్టు 13 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే
జనవరి-ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు (స్వదేశంలో)
తొలి టీ20- జనవరి 22 (చెన్నై)
రెండవ టీ20- జనవరి 25 (కోల్‌కతా)
మూడవ టీ20- జనవరి 28 (రాజ్‌కోట్)
నాలుగవ టీ20 - జనవరి 31న (పుణె)
ఐదవ టీ20- ఫిబ్రవరి 2 (ముంబై)
తొలి వన్డే - ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్)
రెండవ వన్డే - ఫిబ్రవరి 9 (కటక్)
మూడవ వన్డే - ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)
ఫిబ్రవరి-మార్చి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ (యూఏఈ/పాకిస్థాన్)
1. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్- ఫిబ్రవరి 20 (దుబాయ్)
2. భారత్ వర్సెస్ పాకిస్థాన్ - జనవరి 23 (దుబాయ్)
3. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ -మార్చి 1 (దుబాయ్)
జూన్-ఆగస్టులో ఇంగ్లండ్‌లో పర్యటన
1వ టెస్ట్ జూన్ 20 -24 (లీడ్స్)
2వ టెస్ట్ జూలై 2 -6 (బర్మింగ్‌హామ్)
3వ టెస్ట్ జూలై 10 - 14 (లండన్)
4వ టెస్ట్ జూలై 23 -27 (మాంచెస్టర్)
5వ టెస్టు జూలై 31 - ఆగస్టు 4 (లండన్)
ఆగస్టు 2025లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన – 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు
అక్టోబర్ 2025లో స్వదేశంలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు
అక్టోబర్ 2025లో స్వదేశంలో టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్
అక్టోబరు-నవంబర్ 2025లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా. 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్.