Pawan Kalyan: ఆటోలో ప్రయాణం చేసిన పవన్ కల్యాణ్ పిల్లలు

Pawan Kalyan kids travelled in Auto

  • వారణాసికి వెళ్లిన రేణు దేశాయ్, అకీరా, ఆద్య
  • హిందూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న అకీరా
  • ఆటోల్లో ప్రయాణిస్తూ ఆలయాలను దర్శించుకున్న వైనం

తమ తండ్రి పవన్ కల్యాణ్ ఒక సూపర్ స్టార్ అయినా, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా... ఆయన పిల్లలు అకీరా నందన్, ఆద్య మాత్రం ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటారు. 

తాజాగా తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి అకీరా, ఆద్యలు వారణాసికి వెళ్లారు. అక్కడున్న ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అకీరా పూర్తిగా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

వారణాసిలో అకీరా, ఆద్యలు ఆటోల్లో ప్రయాణిస్తూ ఆలయాలను దర్శించారు. వీరిని కొందరు అభిమానులు గుర్తించి, వీడియోలు తీశారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలను విలాసాలకు దూరంగా, సామాన్య జీవితం అర్థమయ్యేలా పెంచుతున్న రేణుదేశాయ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.

Pawan Kalyan
Janasena
Akirna Nandan
Tollywood
  • Loading...

More Telugu News