Chandrababu: ధనిక ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు టాప్.. ఆయన కుటుంబ ఆస్తి ఎన్ని వందల కోట్లంటే..!

ADR List Chandrababu Tops In Richest CMs List

  • ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడించిన ఏడీఆర్
  • చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 931 కోట్లు
  • జాబితాలో అట్టడుగున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత
  • ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ. 15 లక్షలు మాత్రమే
  • దేశంలోని 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ. 1,630 కోట్లు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ. 36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ. 931 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. అలాగే, ఆయనకు రూ. 10 కోట్ల అప్పు ఉంది. ఇక ఈ జాబితాలో కేవలం రూ. 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అట్టడుగున నిలిచారు.

ఏడీఆర్ నివేదిక ప్రకారం.. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ. 332 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ఆయన పేరిట అత్యధికంగా రూ. 180 కోట్ల అప్పు కూడా ఉంది. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ. 51 కోట్లు. 23 కోట్ల రుణభారం ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 55 లక్షల ఆస్తితో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నారు. రూ. 1.18 కోట్ల ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కింది నుంచి మూడోస్థానంలో ఉన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి రూ. 52.59 కోట్లు కాగా, వారి సగటు ఆదాయం ఏడాదికి రూ. 13,64,310. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ. 1,630 కోట్లు.

  • Loading...

More Telugu News