TDP: రికార్డుస్థాయిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు
- అక్టోబర్ 26న ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ
- ఇప్పటికే 90 లక్షలు దాటిన సభ్యత్వాలు
- కార్యకర్తల కోరిక మేరకు సంక్రాంతి వరకు పొడిగించే అవకాశం
- అత్యధిక సభ్యత్వాలతో నెల్లూరు టాప్
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. అక్టోబర్ 26న టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటికే 90 లక్షలు దాటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అండమాన్-నికోబార్‌లలో కలిపి కొత్తగా చేరిన వారు కూడా ఇందులో ఉన్నారు. త్వరలోనే వీటి సంఖ్య కోటికి చేరుకుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజానికి ఈ నెలాఖరుతోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, కార్యకర్తల సూచన మేరకు దీనిని సంక్రాంతి వరకు పొడిగించనున్నట్టు తెలుస్తోంది.
నెల్లూరు టాప్
నియోజకవర్గాల పరంగా చూసుకుంటే 1,44,699 సభ్యత్వాలతో నెల్లూరు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా పాలకొల్లు (1,42,482), ఆత్మకూరు (1,32,610), రాజంపేట (1,29,467), కుప్పం (1,25,255), ఉండి (1,13,247), గురజాల (1,08,077), వినుకొండ (1,04,141), మంగళగిరి (1,02,771), కల్యాణదుర్గం (98,899) అసెంబ్లీ నియోజకవర్గాలు టాప్-10లో నిలిచాయి.