: శ్రీశాంత్ కు బెయిలా.. మళ్ళీ జైలా?


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో పడిన తొలి వికెట్ కేరళ క్రికెటర్ శ్రీశాంత్. ఈ ఎక్స్ ప్రెస్ బౌలర్ ఫై ఢిల్లీ పోలీసులు కఠినమైన మోకా చట్టాన్ని ప్రయోగించి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మోకా కోర్టులో శ్రీశాంత్ బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. శ్రీశాంత్ తో పాటు మరో క్రికెటర్ అంకిత్ చవాన్ బెయిల్ పిటిషన్ ను కూడా విచారించనున్నారు. అంతేగాకుండా శ్రీశాంత్ సన్నిహితుడు, బుకీ జిజూ జనార్థన్ తో పాటు మరో 15 మందికి బెయిల్ పై మోకా న్యాయస్థానం ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా, తాను అమాయకుణ్ణని, ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని శ్రీశాంత్ అంటున్నాడు. మరి మోకా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!.

  • Loading...

More Telugu News