Konda Surekha: చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ

Konda Surekha thanks Chandrababu

  • రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి చేశామన్న మంత్రి
  • సిఫార్సు లేఖలకు ఆమోదం తెలపడం కొత్త ఏడాది కానుక అన్న మంత్రి
  • తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం కొనసాగాలని ఆకాంక్ష

శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు సాయంత్రం ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి చేశామని, ఇది ఫలించిందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సును అంగీకరించడం కొత్త సంవత్సర కానుకగా అభివర్ణించారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం పరస్పర సహకారం అవసరమన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలిపినందుకు గాను ఏపీ సీఎంతో పాటు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News