Manish Sisodia: ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను... ఆర్థిక సాయం చేయండి: మనీష్ సిసోడియా
- క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించిన సిసోడియా
- ప్రజల ఆర్థిక సాయం వల్లే పలుమార్లు గెలిచానన్న సిసోడియా
- ఈ ఎన్నికల్లోనూ మీ ఆర్థిక సాయం కావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా సోమవారం నాడు ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. సిసోడియా ఢిల్లీలోని జంగ్‌పుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2015 నుంచి అతను పట్‌పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
జంగ్‌పుర్ నుంచి పోటీ చేసేందుకు తాను క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించానని సిసోడియా వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసి, విజయాలు సాధించానంటే అందుకు ప్రజలే కారణమన్నారు. వారి ఆర్థిక సహకారం వల్లే పలుమార్లు గెలిచినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ మీ ఆర్థిక సాయం కావాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.