KA Paul: కవిత, ఆమె తండ్రి, అన్న బీసీ కాదు!: కేఏ పాల్

KA Paul faults Kavitha for her bc reservations

  • వారు దొరలు... కానీ తెలంగాణ ప్రజలు ఆ కుటుంబాన్ని దొంగలంటారని విమర్శ
  • స్థానిక ఎన్నికలకు ముందు కవిత బీసీ నినాదం తీసుకోవడం విడ్డూరంగా ఉందన్న పాల్
  • ఇలాంటి రాజకీయ ఉచ్చు నుంచి బీసీలు బయటకు రావాలని పిలుపు

స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీసీలు గుర్తుకొచ్చారని, కానీ ఆమె, ఆమె తండ్రి, అన్న, కుటుంబం బీసీ కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. మామూలుగా మిమ్మల్ని దొరలు అంటారని, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మీ కుటుంబాన్ని దొంగలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కవిత బీసీ నినాదం తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రంపై ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మోపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్లు మాయమయ్యాయని, అవేమయ్యాయో చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రాన్ని ముంచేసి... ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని సర్పంచ్‌ల ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీలు ఇలాంటి రాజకీయ ఉచ్చు నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News