Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy meets Satya Nadella

  • సీఎం వెంట సీఎస్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సత్య నాదెళ్ల నివాసంలో కలిసిన ముఖ్యమంత్రి
  • స్కిల్ యూనివర్సిటీ మధ్య వారి మధ్య చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్‌పై వారి మధ్య చర్చ జరిగింది. స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై సత్య నాదెళ్లతో చర్చించారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే ఏఐ సిటీలో ఆర్ అండ్ డీ ఏర్పాటుకు సహకారంపై కూడా చర్చ జరిగింది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది.

క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలకపాత్ర పోషించాలని సీఎం కోరారు. ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తెలంగాణలో నాలుగు డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రం విస్తరణపై కూడా చర్చ జరిగింది.

Satya Nadella
Revanth Reddy
Microsoft
Telangana
  • Loading...

More Telugu News