BSNL: 425 రోజుల వ్యాలిడిటీతో సరసమైన ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్

BSNL introduces affordable Rs 2398 Recharge plan with 425 days of validity

  • రూ.2398 ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ
  • దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్.. రోజుకు 2జీబీ డేటా లభ్యం
  • ప్రస్తుతానికి జమ్మూకశ్మీర్‌ రీజియన్‌లో మాత్రమే అందుబాటులోకి ప్లాన్
  • త్వరలోనే మిగతా రాష్ట్రాలలో ప్రవేశపెట్టే అవకాశం

రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వీఐ (వొడాఫోన్ ఐడియా) వంటి ప్రైవేటు టెలికం ఆపరేటర్లు జులై నెలలో రీఛార్జ్ ప్లాన్ ధరలను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో చౌకైన ఆఫర్ల కోసం చాలామంది కస్టమర్లు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వైపు చూశారు. ఇప్పటికే లక్షలాది మంది పోర్ట్ అయ్యారు. మరింతమంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ మరో బ్రహ్మాండమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. 

ఏడాది కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. తరచూ రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రూ.2398 ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ చేసుకోవచ్చు. ఏకంగా 850జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో ఇది సమానం. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అదనపు ప్రయోజనాలలో భాగంగా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పంపించుకోవచ్చు. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రస్తుతానికి జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొస్తారనే దానిపై బీఎస్ఎన్ఎల్ స్పష్టత ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News