Nagarjuna: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున

Nagarjuna thanked PM Modi for his words about his father ANR

  • ఇవాళ మన్ కీ బాత్ నిర్వహించిన ప్రధాని మోదీ
  • అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేక ప్రస్తావన
  • మోదీ మాటలు తమకు అమితానందం కలిగించాయన్న నాగార్జున

ప్రధాని నరేంద్ర మోదీకి టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే... ఇవాళ మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని, ఆయన తన సినిమాల్లో భారతీయ విలువలు, సంప్రదాయాలను, సంస్కృతిని చక్కగా చూపించేవారని మోదీ కొనియాడారు. దీనిపై నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"ఐకానిక్ దిగ్గజాల సరసన మా నాన్న గారిని కూడా గౌరవించినందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది కూడా, మా నాన్న గారి శతజయంతి వేళ ఈ ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ సినీ రంగం పట్ల ఆయన దూరదృష్టి, ఆయన అందించిన సేవలు అనేక తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇవాళ మీ ప్రత్యేక ప్రస్తావనతో మా కుటుంబానికి, మా నాన్న గారి నటనను ప్రేమించే అసంఖ్యాక అభిమానులకు అమిత సంతోషం కలిగింది" అని నాగార్జున వివరించారు.

  • Loading...

More Telugu News