Komatireddy Venkat Reddy: తండ్రీకొడుకులు ఇద్దరినీ ఇరికించేందుకే హరీశ్ రావు సిట్ కోరారు: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy responds on ORR issue

  • మామ, బావమరిదిపై కోపంతో హరీశ్ రావు విచారణ కోరారన్న మంత్రి
  • సీఎం విచారణకు ఆదేశించారని వెల్లడి
  • ఒకరో, ఇద్దరో జైలుకు వెళతారని వ్యాఖ్యలు

ఓఆర్ఆర్ టోల్ లీజు అంశంలో కేసీఆర్, కేటీఆర్ లను ఇరికించేందుకే హరీశ్ రావు అసెంబ్లీలో సిట్ కోరారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. మామ మీద కోపంతోనూ, బావమరిది మీద కోపంతోనో హరీశ్ రావు విచారణ కోరారని, సీఎం విచారణకు ఆదేశించారని వివరించారు. 

ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్లపై విచారణకు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఓఆర్ఆర్ ను రూ.7 వేల కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు. ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు నడుస్తోందని... ఇందులో ఒకరో, ఇద్దరో జైలుకు వెళతారని, ఓఆర్ఆర్ వ్యవహారంలోనూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.

Komatireddy Venkat Reddy
Harish Rao
ORR
KCR
KTR
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News