Ramcharan: విజయవాడలో దేశంలోనే అతిపెద్ద కటౌట్.. ఏర్పాటు చేసిన రాంచరణ్ ఫ్యాన్స్.. చెర్రీకి దక్కిన రికార్డ్!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ వచ్చే నెల 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలకపాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో రాంచరణ్‌కు ఆయన అభిమానులు భారీ బహుమతి ఇచ్చారు. విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రాంచరణ్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ కటౌట్‌ను నేడు ఆవిష్కరించనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కటౌట్‌పై పూలు కురిపిస్తారు. ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, ఓ మూవీస్టార్‌కు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి.