Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య.. వీడియో ఇదిగో!

Pawan Kalyan Daughter Aadhya Travels In Auto

  • కాశీలో ఆద్యతో ఆటో రైడ్ అంటూ ఇన్ స్టాలో రేణు దేశాయ్ పోస్ట్
  • తండ్రి ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా కూతురు నిరాడంబరత అంటూ అభిమానుల మెచ్చుకోలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూతురు ఆద్య ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. కాశీ (వారణాసి) లో ఆద్యతో ఆటో రైడ్ అంటూ రేణు షేర్ చేశారీ వీడియో. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు.

తండ్రి ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా కూతురు మాత్రం ఎంత సింపుల్ గా నడుచుకుంటుందో చూడండి అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఆద్య నిరాడంబరతను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆద్య, అకిరాలను ఆడంబరాలు, విలాసాలకు అతీతంగా తల్లి రేణు దేశాయ్ సాధారణంగా పెంచడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News