Mohammed Shami: మహ్మద్ షమీ-సానియా మీర్జా బీచ్‌లో హగ్ చేసుకున్న ఫొటో వైరల్.. డేటింగ్లో ఉన్నారా? పెళ్లి చేసుకున్నారా?.. ఫొటో వెనక అసలు నిజం ఇదీ!
- కొంతకాలంగా షమీ, సానియాపై విపరీతంగా వార్తలు
- నిఖా చేసుకున్నారంటూ ఇటీవల ఫొటోలు వైరల్
- తాజాగా బీచ్‌లో కలిసి ఉన్న ఫొటోపై కామెంట్ల వర్షం
- ఫ్యాక్ట్‌చెక్‌లో నకిలీ ఫొటో అని తేలిన వైనం
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డేటింగ్లో ఉన్నారని ఒకసారి, పెళ్లి చేసుకున్నారని ఒకసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్నట్టుగా చెబుతున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా, వీరిద్దరికీ సంబంధించిన మరో ఫొటో వైరల్ అవుతోంది. సానియా తన భర్త షోయబ్ మాలిక్.. షమీ తన భార్య హసీన్ జహాన్ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే, వారు డేటింగ్లో ఉన్నట్టు గానీ, రిలేషన్షిప్లో ఉన్నట్టు కానీ నిర్ధారణ కాలేదు. వీరు కూడా ఈ వార్తలపై స్పందించలేదు. తాజాగా, షమీ-సానియా బీచ్‌లో హగ్ చేసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ను దున్నేస్తున్న ఈ ఫొటోకు ఇప్పటికే వేలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. కొందరు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇది చూసిన వారు కాస్తా కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. మరికొందరు అప్పుడే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆ ఫొటో క్రెడిబిలిటీ, లొకేషన్, పోస్టు చేసిన తేదీని అనుమానిస్తున్నారు.
ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే?
ఈ ఫొటో క్రెడిబిలిటీపై ఫ్యాక్ట్ చెక్ చేయగా, అటు షమీ కానీ, ఇటు సానియా కానీ ఈ ఫొటోను షేర్ చేయలేదని నిర్ధారణ అయింది. ఫొటోను గమనించి చూస్తే దానిని మార్ఫింగ్ చేసినట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దీనిని సృష్టించినట్టు అర్థమవుతోంది. దీనిని బట్టి కృత్రిమ మేధ, డీప్ ఫేక్ టెక్నాలజీని ఎంత భయంకరంగా ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి క్రియేట్ చేసి సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుండటంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, షమీ, సానియా మీర్జా నిఖా చేసుకున్నట్టుగా చెబుతున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, అవి కూడా ఏఐ ద్వారా సృష్టించినవేనని తేలింది. చివరిగా తేలిందేంటంటే. వైరల్ అవుతున్న సానియా, షమీ ఫొటో నకిలీదని.