Koneru Humpy: కోనేరు హంపికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు

AP CM Chandrababu Congratulates Koneru Humpy

--


ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమంటూ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2024.. భారతదేశ చెస్‌ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని చంద్రబాబు పేర్కొన్నారు. 

కాగా, కోనేరు హంపికి మంత్రి లోకేశ్ కూడా అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని లోకేశ్‌ ట్వీట్ చేశారు. మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు హంపి స్ఫూర్తిగా నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News