Pat Cummins: మెల్‌బోర్న్ టెస్టులో అనూహ్య ఘటన.. షాక్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వీడియో వైరల్

Pat Cummins Denied DRS Over Controversial Third Umpire Call

  • సిరాజ్ క్యాచ్‌ కోసం అప్పీలు చేయగా నాటౌట్‌గా తేల్చిన థర్డ్ అంపైర్
  • సందేహం తీరకపోవడంతో డీఆర్ఎస్ కోరిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్
  • అప్పటికే థర్డ్ అంపైర్ పరిశీలించడంతో మరోసారి సమీక్షించలేమంటూ తిరస్కరించిన ఫీల్డ్ అంపైర్

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఆట నాలుగవ రోజున ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బ్యాట్‌ను తాకి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లిందని భావించిన ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్‌ ఔట్‌కు అప్పీలు చేశారు. స్పష్టంగా కానరాకపోవడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. వేర్వేరు యాంగిల్స్‌‌లో క్షుణ్ణంగా పరిశీలించిన థర్డ్ అంపైర్... బంతి బ్యాట్‌ను తాకిన తర్వాత నేలను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందని నిర్ధారించారు. దీంతో సిరాజ్‌ను నాటౌట్‌గా పరిగణించి ప్రకటించారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అప్పటికీ సందేహం తీరకపోవడంతో డీఆర్ఎస్‌కు వెళ్లాలని భావించారు. డీఆర్ఎస్ కోరుతూ ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అంపైర్‌కు సూచించాడు. అయితే, ప్యాట్స్ కమ్మిన్స్ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించారు. అప్పటికే థర్డ్ అంపైర్ పరిశీలించి నిర్ణయం వెల్లడించినందున మరోసారి రిఫర్ చేయడం కుదరని, రెండోసారి సమీక్షించలేమని వివరించారు. దీంతో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఒకింత షాక్‌కు గురైనట్టు అతడి హావభావాలు కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Loading...

More Telugu News