Venkatesh: తనయుడిని హీరోను చేయడం గురించి స్పందించిన వెంకీ!

Unstoppable 4 Venkatesh

  • 'అన్ స్టాపబుల్ 4'లో గెస్టుగా వెంకటేశ్ 
  • తాము ఇలా ఉండటానికి తన తండ్రి కారణమన్న వెంకీ 
  • తనకి బిజినెస్ చేయాలని ఉండేదని వెల్లడి
  • అనుకోకుండా హీరోను అయ్యానని వ్యాఖ్య 
  • యాక్టింగ్ వైపు రావాలా లేదా అనేది తన తనయుడి ఇష్టమని వివరణ   


 బాలకృష్ణ హీరోగా చేసిన 'డాకు మహారాజ్'...  వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'అన్ స్టాపబుల్ 4' వేదికపై ఇద్దరూ కలిసి 'సంక్రాంతి హీరోలు'గా సందడి చేశారు. వెంకటేశ్ స్టైల్ ను బాలయ్య బాబు సరదాగా అనుకరిస్తూ, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. 

వెంకటేశ్ మాట్లాడుతూ... "మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నది క్రమశిక్షణ. చేస్తున్న వర్క్ పై 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టడం. ఈ రోజున మేము ఇలా ఉండటానికి కారకులు మా నాన్నగారే. నిజానికి నేను ఫారిన్ లోనే సెటిల్ అవుదామని అనుకున్నాను.  ఏదైనా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇండియాకి వచ్చినప్పుడు, ఆయన నన్ను హీరోను చేశారు. సరదాగా 'కలియుగ పాండవులు' చేసిన నేను, ఆ తరువాత కంటిన్యూ అయ్యాను" అని అన్నారు. 

"మా ముగ్గురు అమ్మాయిలతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. వారి కెరియర్ కి సంబంధించిన గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మా అబ్బాయి అర్జున్ కి ఇప్పుడు 20 ఏళ్లు. తాను ఇప్పుడు అమెరికాలో చదువుతున్నాడు. హీరోగా తన లాంచింగ్ ఎప్పుడని మీరు అడుగుతున్నారు. తాను ఇక్కడికి వచ్చిన తరువాత ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. ఏం రాసిపెట్టి ఉందో చూడాలి. ఏం చేయాలనేది తన ఇష్టప్రకారమే జరుగుతుంది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News