Sunil Gavaskar: తెలుగుతేజం నితీశ్ రెడ్డి శతకం... భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్... ఇదిగో వీడియో!
- మెల్‌బోర్న్‌లో సెంచరీతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
- తెలుగు తేజంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు
- నితీశ్ సెంచరీ చేయగానే సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్
- భారత క్రికెట్‌కు దొరికిన మరో టాలెంటెడ్ ప్లేయర్ అని కితాబు
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీతో అదరగొట్టిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో ఇదే హైలైట్ గా నిలిచింది. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న యువ ఆటగాడు... ఆతిథ్య జట్టు బలమైన బౌలింగ్ లైనప్ ను ఎదుర్కొని మరీ శతకం బాదడం విశేషం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి, అది కూడా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సెంచరీ సాధించడం నిజంగా అభినందనీయం.
అందుకే ఈ తెలుగుతేజంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక నితీశ్ కుమార్ రెడ్డి బౌండరీతో శతకం పూర్తి చేయగానే కామెంట్రీ బాక్స్ లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. ఉత్సాహంతో ఉరకలేస్తూ కామెంట్రీ చెప్పాడు. సూపర్బ్ ఇన్నింగ్స్.. భారత క్రికెట్‌కు దొరికిన మరో యంగ్ టాలెంట్ అంటూ ప్రశంసించాడు. గ్రేట్ టాలెంట్, టెంపర్ మెంట్‌ల కలయిక అని కితాబిచ్చాడు. ఇలాంటి సెంచరీలు నితీశ్ రెడ్డి మరిన్ని సాధించాలని లిటిల్ మాస్టర్ ఆకాంక్షించాడు.